Monday, 2 November 2026

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి
గోపాల్ పేట్ జనం సాక్షి మార్చి 30: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం గోపాల్ పేట్  మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ కోదండరామస్వామి ఆలయంలో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణానికి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చంద్రశేఖర్,  జడ్పిటిసి మంద భార్గవి, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ కేతమ్మ కాశీనాథ్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, బిఆర్ఎస్ నాయకులు మంద కోటేశ్వర్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ గువ్వల రాములు, తదితరులు పాల్గొన్నారు