Wednesday, 4 November 2026

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను అకస్మాత్తుగా తనిఖీ చేసిన డీఎస్పీ నాగేశ్వర్ రావు

 

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి ఏప్రిల్ 8 జనంసాక్షి న్యూస్: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను దేవరకొండ డిఎస్పి నాగేశ్వర్ రావు శనివారం నాడు అకస్మాత్తుగా తనిఖీ చేశారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ ఇతర అవకతవకలు జరగకుండా పటిష్టంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని దేవరకొండ డిఎస్పి నాగేశ్వర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు శనివారం నాడు కొండమల్లేపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గురుకుల పాఠశాల, నాగార్జున స్కూల్, మటిల్డా స్కూల్ లలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాల‌ను సీఐ శ్రీనివాస్, తాసిల్దార్ మహేందర్ రెడ్డి, ఎస్ఐ వీరబాబు మరియు ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తూ పదవ తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా పక్డబందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి కాలుక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, ఏ ఇతర ఎలక్రానిక్ వస్తువులను అనుమతించరాదన్నారు. ఇన్విజిలేటర్ల మొబైల్ ఫోన్లు కూడ బయటే డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఇటీవల కొన్ని ప్రాంతాలలో పేపర్ లీకేజీ లాంటి సమస్యలు రావడంతో పరీక్షా నిర్వహణ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు ఇతరులు ఎవరు కూడా పరీక్ష కేంద్రాలలో రాకుండా ఉండాలని సూచించారు పరీక్షా కేంద్రాల సమీప ప్రదేశాల్లో 144 సెక్షన్ అమలు పరచడంతో పాటు జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అవకతవకలు జరగకుండ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పదవ తరగతి పరీక్ష నిర్వహణ అధికారులకు తెలిపారు