Tuesday, 3 November 2026

పదవ తరగతి విద్యార్థుల వీడుకోలు సమావేశం

పదవ తరగతి విద్యార్థుల వీడుకోలు సమావేశం.చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :- మండల పరిధిలోని ఫైజాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు పలికారు. విద్యార్థులకు హల్ టికెట్స్ పంపిణీ చేసి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు. HM తారా సింగ్ గారు మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ఎటువంటి భయ భ్రాంతులకి లోను కాకుండా మంచి GPA సాధించాలని విద్యార్థులను ఉత్సాహ పరిచారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు తమ సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మజ, సంతోష, ఫీబి, కృష్ణమూర్తి, రాధిక, హిందురాని, కరుణ,       స్నేహాలత గ్రామ సర్పంచ్ మనోహర నర్సింహారెడ్డి పాల్గొన్నారు.