తూప్రాన్ జూన్ 3( జనం సాక్షి) ::: పదేళ్ల కెసిఆర్ పాలనలు రైతును రాజును చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ సురేందర్ రెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి కలెక్టర్ లో జరిగిన రైతు దశాబ్ది వేడుకల సందర్భంగా ఆయన పాల్గొని ప్రసంగించారు పది సంవత్సరాల క్రితం ప్రతి రైతు ఎరువులకు విత్తనాలకు సాగునీటికి విద్యుత్తుకు వేయి కళ్ళతో ఎదురు చూసేవాడని వచ్చే మూడు నాలుగు గంటల విద్యుత్‌కు రైతులు పొలాల వద్దనే పడుకొని విద్యుత్తు వచ్చినప్పుడే మీరు సరఫరా చేసుకొని వారిని రాత్రి వేళల్లో పాములు కలిసి ఎంతమంది రైతులు చనిపోయారని సాగునీటికి తాగునీటికి అనేక అష్ట కష్టాలు పడ్డారని నేడు రైతులకు అన్ని అందుబాటులో ఉన్నాయని అన్నారు రైతుకు 24 గంటల విద్యుత్తు సాగునీరు తాగునీరు మార్కెట్లో ఎరువులు అందుబాటులో ఉండడం విత్తనాలు అందుబాటులో ఉంటున్నాయని పంటకు ఎకరాకు 5000 రూపాయలు రైతుబంధు ఇస్తున్నాడని ఈ కారణంగా అయినా రైతు చనిపోతే అతనికి ఐదు లక్షల కుటుంబానికి పరిహారం ఇస్తు కుటుంబాన్ని రైతు భీమా ద్వారా ఆదుకుంటున్నారని అన్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు రైతు నేడు సుఖంగా జీవిస్తున్నారని అన్నారు 10 సంవత్సరాల క్రితము నేటికీ జరుగుతున్న అభివృద్ధి పనులను మీరే చూస్తున్నారని మరోసారి బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు బీమాకు ఒక్కో రైతుకు రాష్ట్ర ప్రభుత్వం 3600 ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం కడుతుందని ఎలాంటి ప్రమాదవశత అయిన చనిపోయిన రైతు ఇంటికే 5 లక్షల రూపాయలు అందుతాయని అన్నారు గుండ్రెడ్డిపల్లి క్లస్టర్లు లో 72 మంది రైతులకు రైతు బీమా అందజేసిందని తెలిపారు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాల రైతులకు అమలు చేస్తున్నారని తెలంగాణ ఆదర్శంగా తీసుకొని అమలు చేయాలని ఇతర రాష్ట్రాల వారు ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు మండల వ్యవసాయ అధికారి గంగుమల్లు మాట్లాడుతూ గుంతరెడ్డిపల్లి క్లస్టర్లు తొమ్మిది గ్రామాలలో 5283 మంది రైతులకు 36 కోట్ల రూపాయలు రైతుబంధు రైతులకు అందించిందని తెలిపారు వానాకాలం వారిని ముందస్తుగా సాగు చేయాలని రైతులకు సూచించారు ప్రకృతి వైపరీత్యాలలో నుండి కాపాడుకోవడానికి యాసంగి పంటలను ముందుగానే వెయ్యాలని శాస్త్రవేత్తలు సూచించారని దానికి అనుగుణంగా రైతులు వరి పంటను వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్ మండల సహాయ వ్యవసాయ అధికారి సింధు గుండ్రెడ్డిపల్లి సర్పంచ్ శ్రీలత గుంతపల్లి రైతుబంధు అధ్యక్షుడు మన్ని కృష్ణ ఎంపీటీసీలు సంతోష్ రెడ్డి సర్పంచులు సుకన్య రమేష్ షేర్ నరసింహారెడ్డి కంకణాల పాండు నరసమ్మ కత్తుల సత్యనారాయణ నవీన్ రమేష్ రైతు నాయకులు, కృష్ణారెడ్డి మల్లారెడ్డి రాజిరెడ్డి రూబీ వెంకట్రాంరెడ్డి శంకర్ రెడ్డి కొలిచెలిమే అశోక్ తదితరులు పాల్గొన్నారు గుండేడిపల్లి నుండి రైతు వేదిక వద్దకు ట్రాక్టర్లతో భారీ ఊరేగింపు నిర్వహించారు అనంతరం వచ్చిన రైతులకు భోజనాలు ఏర్పాటు చేశారు
పదేళ్లలో రైతును రాజును చేసిన ఘనత కేసిఆర్ కి దక్కుతుంది




