Wednesday, 4 November 2026

మర్చి పోకుండా పండుగలకు పెళ్లిళ్లకు ఇంటికి వచ్చే బంధువులతో ఇట్టి విషయాలను చర్చించుకోవాలనీ కమిషనర్ గుర్తు చేశారు.

 శివ్వంపేట మండలంలో అదనంగా క్లస్టర్ ల ఏర్పాటుకు, గోదాముల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ ఫుట్ సబ్సిడీగా ఇస్తున్న రైతుబంధు దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మాడల్ గా నిలిచిందన్నారు. జిల్లాలో కాళేశ్వరం జలాలతో సాగునీటి సౌకర్యం పెరిగిందని నాడు 76 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుండగా నేడు నాలుగురెట్లు పెరిగిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతన్న నష్టపోరాదనే సంకల్పంతో ప్రభుత్వం పంట కాలాన్ని ఒక నెల ముందుకు జరిపిందని, ఈ వానాకాలం పంట జూన్ 25 నుండి ప్రారంభించాలని రైతులకు సూచించారు.
అనంతరం మన తెలంగాణా.. దేశానికే అన్నపూర్ణ కరపత్రాన్ని, గోడ పత్రికలను కమీషనర్, కలెక్టర్ ఆవిష్కరించారు. ఆ తరువాత కలెక్టర్ దొంతి లో నూతన రైతు వేదికను ఎంపిపి కల్లూరి హరికృష్ణతో కలిసి రైతు వేదికను కలెక్టర్ ప్రారంభించారు. అంతకుముందు సమావేశంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, స్థానిక సొసైటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్, నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డిలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సమాచార శాఖ అధికారి శాంతి కుమార్, జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, ఆర్డీఓ శ్రీనివాసులు, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, తహశీల్ధార్ శ్రీనివాస్ చారి, ఆత్మా కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లావణ్య మాధవ రెడ్డి, ఎంపీటీసీ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ కాముని శ్రీనివాస్, ఏఈవో మాజీద్ లతో పాటుగా వివిధ గ్రామాల సర్పంచులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.