Tuesday, 3 November 2026

పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లాలో పబ్లిక్‌ పరీక్షల ఫీవర్‌ మొదలయ్యింది. ఇప్టపికే ప్రత్యేక తరగతుల నిర్వహణతో విద్యార్థులను సన్నద్దం చేశారు. ఇక టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు వారిని సిద్దం చేస్తున్నారు. ఈ తడవ ఉత్తమ ఫలితాలు సాధించేలా వారిని సన్నద్దం చేశారు. పదో తరగతి పబ్లిక్‌  పరీక్షలు ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 11 వరకు నిర్వహిస్తారు. ఇందుకు పక్కాగా ఏర్పాట్లు చేశామని  జిల్లా విద్యాశాఖాధికారి కె.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 203 పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షలు ఉదయం 09.30గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరుగుతాయన్నారు. పరీక్షకేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇక ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌  పరీక్షకేంద్రాల నిర్వాహకులు పరీక్షల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని  జిల్లాకేంద్రంలోని ఆర్‌ఐఓ కార్యాలయం నుంచి తీసుకెళ్లాలని ఆర్‌ఐఓ సిహెచ్‌.ప్రభాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల హాల్‌టికెట్లు, నామినాల్‌రోల్స్‌, సమాధానపత్రాలను తీసుకెళ్లాలని సూచించారు. ఇంటర్‌ పరీక్షలకు కూడా చురకుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *