Tuesday, 3 November 2026

వ్యక్తిగత మరుగుదొడ్లకు ప్రాధాన్యం

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని డ్వామా పీడీగా  బాధ్యతల స్వీకరించిన శ్రీనివాస్‌ ప్రకటించారు. ఇదే తమ ప్రాధాన్యమని అన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస(డ్వామా) పథక సంచాలకులుగా కె.శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరించాక ఆయన మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. బాధ్యతలు స్వీకరించాక  సిబ్బందితో సవిూక్ష నిర్వహించారు. అమలవుతున్న పథకాల తీరుతెన్నులను అడిగితెలుసుకున్నారు. గ్రామాల్లో అపరిశుభ్రతకు కారణమైన మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యంపై వివరాలు అడిగితెలుసుకున్నారు. డ్వామా పీడీగా నియమితులైన శ్రీనివాస్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌  జగన్మోహన్‌ను కలుసుకున్నారు. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి మరుగుదొడ్ల నిర్మాణంలో సహకరించాలన్నారు. వ్యక్తగత మరుగుదొడ్లకు ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. ప్రజలు పరిశుభ్రతలను పాటిస్తూ స్వచ్చతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అప్పుడే అంటురోగాలు వ్యాప్తి చెందవన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *