సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : బుధవారం వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు జిల్లా కేంద్రంలోని జయ ఐఐటి ఒలంపియాడ్ స్కూల్ కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 10 కి 10 సిజిపిఏ సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 283 విద్యార్థుల్లో 47 మంది 10కి 10 జీపీఏ సాధించినట్లు తెలిపారు. 41 మంది విద్యార్థులు 9.8 జీపీఏ , 27 మంది విద్యార్థులు 9.7 జీపీఏ , 31 మంది విద్యార్థులు 9.5 జీపీఏను సాధించారని అన్నారు. మొత్తం 217 మంది విద్యార్థులు 9 లేదా అంతకంటే ఎక్కువ సీజీపీఏ సాధించారని వెల్లడించారు.ఉత్తమ ప్రతిభను కనబరచిన విద్యార్థులను ఈ ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బింగి జ్యోతి , జెల్లా పద్మ , ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




