,బై0సా. రూరల్ మే 09జనం సాక్షిజిల్లా బైంసా పట్టణంలోని పదో తరగతి ఫలితాల్లో బై0సా ఆల్ఫోర్స్ పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించి0ది. ఏడుగురు విద్యార్థులు 10/10 జిపిఏ, ఆరుగురు విద్యార్థులు 9.8 జిపిఏ, తొమ్మిదిగురు 9.7 జిపిఏ మరియు 9 పాయింట్ల కి పైనా 16 మంది విద్యార్థులు అద్బుతమైన ఉత్తీర్ణతతో ప్రతిభను చాటారని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
విద్యార్థులను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు అభినందించారు.




