Tuesday, 3 November 2026

పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఏకగ్రీవ ఎన్నిక..

భువనగిరి టౌన్ జనం సాక్షి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో స్థానిక ఎస్ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం (అఖిలభారత పద్మశాలి సంఘానికి అనుబంధంగా నారాయణ గూడా ) పద్మశాలి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరిగింది నూతన అధ్యక్షునిగా చిక్క వెంకటేశ్వర్లు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరియు జిల్లా పద్మశాలి యువజన విభాగం అధ్యక్షునిగా మిరియాల శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సుమారు 17 మండలాలు మరియు ఆరు మున్సిపాలిటీలు నుండి అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని 72 మంది కార్యవర్గాన్ని పద్మశాలి కుల పెద్దలు మరియు ప్రజా ప్రతినిధులు కుల బాంధవుల మధ్య ఎన్నిక నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వొలందాస్ ఆదినారాయణ బొద్దుల నగేష్ ఆడెపు శ్రీశైలం గాడి పల్లి శ్రవణ్ కుమార్ గుండు ప్రసాద్ పోచం సోమయ్య చింతగింది శ్రీధర్ బడుగు సత్యనారాయణ పున్న వెంకటేశం జంగయ్య పురుషోత్తం కందగట్ల బిక్షపతి శ్రీరామ్ సత్తయ్య ఈ కార్యక్రమంలో పద్మశాలి కునుబంధువులు సుమారు 500 మంది పాల్గొని యాదాద్రి భువనగిరి పద్మశాలి జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది