ధర్మపురి అంగన్వాడీ టీచర్లకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ధర్మపురిలో ఆందోళనకు దిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అంగన్వాడీలు.జిల్లాలోని ప్రాజెక్టుల్లో 2000కు పైగా అంగన్వాడీ టీచర్లు పని చేస్తున్నారని, యూనియన్ గత 20ఏళ్ల క్రితం నుంచి అరకొర సౌకర్యాలతో విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ,ఐసీడీఎస్,అంగన్వాడీ ఉద్యోగుల హక్కుల కోసం మార్చ్ 1,2,3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం మనందరికీ విదితమే సమ్మె లో భాగంగా ధర్మపురి మండలానికి సంబందించిన అంగన్వాడీ టీచర్స్ &హెల్పర్స్ చలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్న సందర్భంలో వారిని కలిసి సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మరియు నాయకులుఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంగనభట్ల దినేష్ మాట్లాడుతూ, అంగన్వాడీలకు సమస్యలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి వీరి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా న్యాయపోరాటం చేస్తామని,అదేవిధంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల పై online పని పేరు తో అనేక యాప్ లు తీసుకువచ్చి పని భారాన్ని విపరీతంగా పెంచుతున్నారు, పర్మినెంట్,కనిసవేతనం,పెన్షన్,esi,ఉద్యోగ భద్రత లాంటి సౌకర్యాలు కల్పించేతవరకు, ప్రభుత్వం పై పోరాటం చేసేందుకు అంగన్వాడీ ఉద్యోగులకు తాము సైతం అండగా ఉంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు సంగనబట్ల సంతోషి,జక్కు పద్మ,గరిగే అరుణ నాయకుడు వేముల రాజేష్,గరిగే రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్న: అంగన్వాడీ టీచర్స్




