భైంసా రూరల్ మార్చ్ 02 జనం సాక్షి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసినటువంటి భారత్ జూడో యాత్ర కు కొనసాగింపుగా నిర్మల్ జిల్లాలోని పైసా పట్టణంలో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు రేపు సాయంత్రం మూడు గంటలకు హత్ సే హత్ జోడో యాత్ర కొనసాగుతుందని దీనికి రాష్ట్ర కేంద్రం నుండి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎఐసిసి ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు అవుతారని తెలిపారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, మోడీ ప్రభుత్వం పెంచినటువంటి ధరలను తగ్గించాలని, భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఖూని ఐతున్నటువంటి తరుణంలో, నేనున్నానని భరోసా కల్పిస్తూ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి మద్దతుగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకత్వం మొత్తం పాదయాత్ర చేస్తున్నటువంటి సంగతి విధితమే. దేశంలో ప్రతి ఆర్థిక సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వన్ని గద్దె దించడానికి, రాష్ట్రంలో టిఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలకు చర్మ గీతం పాడాలనే దృఢ సంకల్పతో రేపు సాయంత్రం ప్రారంభమయ్యే కాంగ్రెస్ పార్టీ పోరు యాత్రకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సానుభూతిపరులు, యువకులు,యువకులు కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరై యాత్రని విజయవంతం చేయవలసిందిగా డీసీసీ అధ్యక్షులు డి.ముత్యం రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గం ఇంచార్జి ఆనందరావు పటేల్ యువజన కాంగ్రెస్ పార్టీలో ఆలూరు ప్రశాంత్, కుబీర్ మండల అధ్యక్షులు జయరాం నాయక్,బాసర మండల అధ్యక్షులు రామేశ్వర్ దేశ్ముఖ్, యువజన కాంగ్రెస్ నాయకులు నకిడి నవీన్, సూర్యవంశీ సాయినాథ్ పటేల్,పండరి గౌడ్,తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పోరుయాత్రని విజయవంతం చేయండి కాంగ్రెస్ పార్టీ పోరుయాత్రని విజయవంతం చేయండి -డిసిసి అధ్యక్షుడు దొడ్డికింది ముత్యంరెడ్డి పిలుపు.




