Thursday, 5 November 2026

పన్నూర్ లో పర్యటించిన జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి

జనంసాక్షి, రామగిరి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో బాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లోని పన్నూర్ గ్రామపంచాయతీ లో సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు వంటి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి గారు సందర్చించారు. వారి వెంట మండల పంచాయతీ అధికారి కాటం భాస్కర్, పంచాయతీ కార్యదర్శి పూరెళ్ల ఆకాష్ గౌడ్, కారోబార్ పెరుమాండ్ల అభి, ఇజ్జగిరీ సారయ్య, మోతుకూరి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.