Friday, 6 November 2026

పప్పు లోకేశ్‌కు రాహుల్‌ తోడు: రోజా

చిత్తూరు,నవంబర్‌14(జ‌నంసాక్షి): ప్రజలను మోసం చేసి సీఎం చంద్రబాబు గ్దదెనెక్కారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. చంద్రబాబుతో కలిసిన రాహుల్‌ గాంధీ.. బాబు ఇచ్చిన వీణ వాయించుకుంటూ కూర్చోవాల్సిందేని ఎద్దేవాచేశారు. తెలుగు పప్పు లోకేష్‌కు తోడుగా రాహుల్‌ పప్పు చేరారని విమర్శించారు. గత ఎన్నికల్లో జగన్‌ను గెలవకుండా చేయాలని, చంద్రబాబు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే వెకిలి నవ్వులు, పచ్చి నవ్వులు నవ్వుతున్నారని రోజా పేర్కొన్నారు.