Wednesday, 4 November 2026

పబ్లిక్ టాయిలెట్స్ లేక పబ్లికి ఇబ్బంది-లైవ్ అధ్యక్షుడు మహేందర్ జాధవ్.

పబ్లిక్ టాయిలెట్స్ లేక పబ్లికి ఇబ్బంది-లైవ్ అధ్యక్షుడు మహేందర్ జాధవ్.
నెరడిగొండడిసెంబర్3(జనంసాక్షి):మండల కేంద్రానికి చుట్టూ ప్రక్క ప్రాంతం ప్రజలు ప్రతి శనివారం సంతకు నిత్యావసర వస్తువులు సరుకుల కోసమే కాకుండా ప్రతి రోజు ప్రతి అవసరపు పని కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మండల కేంద్రానికి వస్తూ పోతూ ఉంటారు.అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా నెరడిగొండ మండల కేంద్రంలో అన్ని లభిస్తాయి కానీ పబ్లికు పబ్లిక్ టాయిలెట్స్ లేకపోతే ఎక్కడ వెళ్లలో తెలియక తలలు పట్టుకుంటున్నారని అందుచేత ఇప్పటికైనా ఉన్నతాధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు దీనిపైన దృష్టి సారించి జనం ఎదుర్కొంటున్న టాయిలెట్స్ సమస్యలను పరిష్కరించాలని శనివారం రోజున మండల ఎంపీపీ రాథోడ్ సజన్ కి వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో జిల్లా లైవ్ అధ్యక్షుడు మహేందర్ జాధవ్ మండల లైవ్ ఇంచార్జి పాండు ఉన్నారు.ఇట్టి విషయంపై ఎంపీపీ రాథోడ్ సజన్ స్పందించి ఈ సమస్యలు అందరి కంటికి కట్టినట్లు పబ్లిక్ గోస కనబడుతుంది.పై అధికారులకుప్రజాప్రతినిధులతో చర్చించి మండల ప్రజా కష్టాలను దూరం చేసే విదంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.ఇట్టి సందర్భంలో లైవ్ అధ్యక్షుడు మహేందర్ జాధవ్ మండల లైవ్ ఇంఛార్జి పాండు మండల టీఆరెస్ పార్టీ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ నానక్ సింగ్ జనార్ధన్ నారాయణ తదితరులు ఉన్నారు.