మండలం వ్యాప్తంగా ఓటర్ నమోదు కార్యక్రమం..!!
గడ్డమీది నాగరాణి నర్సింలు
జనం సాక్షి/ కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి గ్రామంలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గడ్డమీద నాగరాణి ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రోజులపాటు ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ అరుంధతి, ఆర్ ఐ శ్రీహరి పాల్గొన్నారు. జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్ నమోదు చేసుకోవాలని గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేసుకున్న విధంగా అవగాహన కల్పిస్తున్నామని సర్పంచ్ నాగరాణి తెలిపారు




