Wednesday, 4 November 2026

పరిశ్రమల అభివృద్ధికి కేటీఆర్ కృషి :

పరిశ్రమల అభివృద్ధికి కేటీఆర్ కృషి :శామీర్ పేట్, జనం సాక్షి :సోమవారం శామీర్ పేటలో ఐటీ పరి శ్రమలో విశేష కృషిచేస్తున్న కేటిఆర్ చిత్ర పటానికి కేసీఆర్ సేవా దళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు కేటిఆర్ ఐటీ పరిశ్రమ ను వృద్ధి లోకి తీసుకు వచ్చిన దరిమిలా యువతి , యువకులకు ఎన్నో ఉపాధి అవకాశాలు లబించాయని, ప్రస్తుతం ఐటీ రంగం కూడా పుంజు కోవటం మన తెలంగాణా కు, తద్వారా భారత దేశానికే గర్వకారణం అని అన్నారు. ఈ సారి బిఆర్ ఎస్ ను భారత ప్రజలు ఆశీర్వదిస్తె త్వరలో యావత్తు భారతావని పులకించి పోయే పథకాలతో ప్రజలు విలసిల్లుతారని అఫ్జల్ ఖాన్ పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, బత్తుల శశికాంత్ యాదవ్, పసుపుల నర్సింహ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.