Wednesday, 4 November 2026

పరీక్ష పేపర్ లీకులన్నీ బిజెపి కుట్రలే బిఆర్ఎస్ నాయకులు సురేష్ మహారాజ్

 

 

 

 

 

 

 

 

అలంపూర్ జనంసాక్షి (ఏప్రిల్ 6)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను భంగం కలిగించడానికి బిజెపి పరీక్ష పత్రాలలీకుల రాజకీయ కుట్రచేసింది,ఎన్ని కుట్రలు పన్నినా గెలిచేది బిఆర్ఎస్అని నాయకులు సురేష్ మహారాజ్ అన్నారు. గురువారం అలంపూర్ చౌరస్తా లో విలేకరుల తో బిఆర్ఎస్ నాయకులు సురేష్ మహరాజ్ మాట్లాడుతూ బిజెపి చేస్తున్న కుట్రలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే, రాజకీయ కుట్రతో బిఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని, బిజెపి ఎన్నో కుట్రల వ్యవహారంలో భాగంగా పేపర్ లీకేజీలను, బిఆర్ఎస్ పార్టీపై రుద్దుతూ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ ఉదేశపూర్వకంగానే ప్రజలను తప్పుదారి పట్టించడం జరుగుతుంది న్నారు. ఓట్ల కోసం వేస్తున్న ఎత్తుల్లో భాగంగానే బిజెపి నాయకులు పేపర్ లీకులను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ కుట్రకు తెరలేపుతూనే ఉన్నారని మండిపడ్డారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి ఇలాంటి చిల్లర రాజకీయ కుట్రలకు పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. ప్రశాంతంగా ససశ్యామలంగా ఉన్న తెలంగాణలో బిజెపి ప్రభుత్వం నిచానికి దిగజారడం ప్రజలు గమనిస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఘనకార్యాలు ఏమీ లేవని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు పన్నినా మళ్లీ గెలిచేది బిఆర్ఎస్ పార్టీనే అని స్పష్టం చేశారు.