చెన్నై, జనంసాక్షి: దర్శకుడు కళంజియం పరువు కేసులో నటి అంజలి కోర్టుకు హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆమెకు మరో అవకాశం ఇచ్చింది. జూన్ 5 న విచారణ హాజరుకావాలని అంజలిని సైదాపేట కోర్టు ఆదేశించింది. విచారణకు హాజరుకాకుంటే అరెస్టు జారీ చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. డబ్బుల కోసం తనను వేధించారని అంజలి ఆరోపించడంతో కళంజియం పరువు నష్టం దావా వేశారు.




