పర్యావరణ పరిరక్షణ-సకల జీవరాశులకు రక్షణ: ఎం వి ఐ సంగం వెంకట పుల్లయ్య
పెనుబల్లి, నవంబర్ 12(జనం సాక్షి) పర్యావరణానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు తమ వంతు బాధ్యతగా విరివిగా మొక్కలు నాటి పెంచాలని ప్రకృతి ప్రేమికులు, సత్తుపల్లి మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య ప్రజలను కోరారు, పెనుబల్లి మండలం చింతగూడెంలోని పశువుల ఆసుపత్రి ఆవరణ లో ప్రకృతి హరిత దీక్ష లో భాగంగా 46 వ రోజున బాదం, నేరేడు రెండుమొక్కలనునాటారు, ఈ కార్యక్రమంలోముఖ్య అతిథులుగా గ్రామ పంచాయతీ సర్పంచ్ తిరుమలశెట్టి నాగదాసు, స్థానిక యం.పి.టి.సి పోతురాజు వెంకట కృష్ణారావు పాల్గొని మాట్లాడుతూ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన అడవులను తమ అవసరాల కోసం నరకడం వలన మానవుల మిగిలిన జీవరాశుల జీవన విధానానికి ఆటంకం కలుగతుందని అన్నారు, స్థానిక యం ఆర్ పి యస్ నాయకులు కొలికపోగు అంజయ్య, యం వి ఐ వెంకట పుల్లయ్య ప్రకృతి హరిత దీక్ష చేపట్టి ప్రతి రోజూ మొక్కలు నాటడం చూసి స్ఫూర్తి ని పొంది తనవంతు బాధ్యతగా ఈ రోజు మొక్కలను నాటే ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు, ప్రకృతి హరిత దీక్ష తీసుకొని ప్రతి రోజూ మొక్కలు నాటుతూ46 రోజుల్లో విజయవంతంగా ఈ రోజు వరకు మొత్తం 50 మొక్కలు నాటడం జరిగిందని ఈ వెంకట పుల్లయ్య సంతోషాన్ని వ్యక్తం చేసి ఆయన మాట్లాడుతూ సమస్త మనవాళితో పాటు సమస్త జీవకోటికి కూడా గాలి, నీరు, ఆహారం, అనుకూలమైన వాతావరణం అవసరమని అందుకు మూలంమొక్కలు, చెట్లు అని వాటిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు, మన భావి తరాలు ఆరోగ్యంగా జీవించాలంటే పర్యావరణ సమతుల్యత తప్పనిసరి అన్నారు,ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రావు, మేస్త్రీ నరసమ్మ, స్థానిక ప్రజలు ,విద్యార్థులు పాల్గొన్నారు.




