హైకోర్టు జడ్జిని సన్మానించిన టేకులపల్లి నాయకులు
టేకులపల్లి, నవంబర్ 12( జనం సాక్షి): భద్రాచలంలో హైకోర్టు జడ్జి భీమపాక నగేష్ ఆత్మీయ పౌర సన్మాన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో టేకులపల్లి మండలం కు చెందిన వైయస్సార్ టిపి నాయకులు ఆన్తోటి రాకేష్, టిఆర్ఎస్ నాయకులు కాలే ప్రసాద్ రావు, దాసరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు. కాలే ప్రసాదరావు మాట్లాడుతూ తను ఇంటర్మీడియట్ శారదా కాలేజీలో క్లాస్మేట్ అయినటువంటి హైకోర్టు జడ్జిగా నగేష్ బీమపాక బాధ్యతలు చేపట్టడంఎంతో గర్వంగా ఉందని, తనతో పాటు చదువుకొని ఉన్నతమైన స్థానానికి ఎదగడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని, అత్యంత ఉన్నత స్థానమైన సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందాలని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.




