Wednesday, 4 November 2026

పలువురు వినికిడి శక్తి కోల్పోయారు : ఆసుపత్రి వైద్యులు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనలో క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. కొంతమందిని మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రులకు తరలించారు. గడ్డిఅన్నారం బస్తీలోని కమల, నిఖిల్‌, సిగ్మా, టీకేఆర్‌ ఆసుపత్రుల్లో 23 మంది చికిత్స పొందుతున్నారు. క్షత్రగాత్రులకు ఆందుతున్నా వైద్య సేవలను సరూర్‌నగర్‌ రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బాంబు పేలుడు ధాటికి పలువురి వినికిడి శక్తి కోల్పోయారని వైద్యులు తెలిపారు. వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *