Wednesday, 4 November 2026

షెడ్యూల్‌ ప్రకారమే హైదరాబాద్‌ టెస్టు

చెన్నై : హైదరాబాద్‌లో జంట బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. మార్చి 2న హైదరాబాద్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడంతో తమ ఆటగాళ్ల భద్రతపై బీసీసీఐ ప్రతినిధులు, ఇతర అధికారులతో చర్చించినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవో జేమ్‌స సుధర్‌లాండ్‌ తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌లో రెండో టెస్టు మ్యాచ్‌ జరుగుతుందని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *