Wednesday, 4 November 2026

పల్లె దవాఖాన ప్రారంభోత్సవం

వేములవాడ, జూన్ 6 (జనంసాక్షి) వేములవాడ మున్సిపల్ పరిధిలోని 3 వ వార్డు అయ్యోరిపల్లి గ్రామంలో పల్లె దవాఖానాను ప్రారంభించిన డాక్టర్ బసాని విశ్వేశ్వర్ అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యం పల్లెల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలు ఏర్పాటు చేసిందని గ్రామస్తులువైద్యసేవలువినియోగించుకోవాలని ఆయన అన్నారు, అలాగే గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో పల్లె దవాఖాన ఏర్పాటు చేయడం చాలా సంతోషమని కానీ దవాఖానాలో బిపి ,షుగర్, లాంటి టెస్టు యంత్రాలు కూడా పెడితే బాగుంటుందని అలాగే రెండు బెడ్లు కూడా ఏర్పాటు చేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లలిత, గ్రామ మాజీ సర్పంచులు ఉల్లేందుల అంజయ్య, వడిజ మల్లయ్య ,హన్మయ్య, వెంకటేశం ,మల్లయ్య, రాజు, తిరుపతి, లింగయ్య, రాజు, అనిల్, లచ్చవ్వ, ఆశా వర్కర్ రేణుక, అంగన్ వాడి టీచర్ బుజ్జమ్మ గ్రామస్తులు తదితరులు ఉన్నారు