Wednesday, 4 November 2026

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఏటూరునాగారం(జనం సాక్షి),జూన్06.
ఈ రోజు ఏటూరు నాగారం మండలం లోని కొండాయి గ్రామానికి చెందిన ఎంపీటీసీ మల్లెల ధన లక్ష్మి నిన్న ఫ్రిజ్ డోరు తెరుస్తుండగా షాక్ గురై మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అదే విధంగా కన్నాయి గూడెం మండలం లోని కంతన పెల్లి గ్రామ సర్పంచ్ చింత నర్సక్క ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే సీతక్కఈ కార్యక్రమంలో నియోజక వర్గ కో ఆర్డినేటర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్స వడ్ల వెంకన్నమండల అధ్యక్షులు ఎండీ అఫ్సర్ పాషా,చిటమట రఘు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,జిల్లా నాయకుల గుడ్ల దేవేందర్,దబ్బకట్ల శ్రీను,రమేష్,సాంబ శివ రావు,సమ్మయ్య,దుర్గం బైరు తదితరులు పాల్గొన్నారు.