హైదరాబాద్, మార్చి 5: పవన్ పర్యటనలో దురుద్దేశాలు లేవని, పవన్‌కు అనుమానాలుంటే నివృత్తి చేస్తామని గాలి ముద్దుకృష్ణమ నాయుడు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన సమస్యలపై చంద్రబాబును, కాంగ్రెస్ విమర్శించడం సిగ్గుచేటని ముద్దుకృష్ణమ ఆరోపించారు. చంద్రబాబును అడిగే రాష్ట్ర విభజన చేశారా అని ప్రశ్నించారు. లాఠీచార్జీలు, ఫైరింగ్ లేని భూసమీకరణ ఘనత చంద్రబాబుదేనని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో సోంపేట, కాకరపల్లిలో ఆరుగురిని చంపి భూములు లాక్కున్నారని ఆయన గుర్తుచేశారు.




