కర్నూలు, మార్చి 5: పోలవరం ప్రాజెక్టు వల్ల రాయలసీమకూ ప్రయోజనం చేకూరుతుందని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మంత్రి ఆరోపించారు. సాగునీరు కావాలని సీమలో దీక్షలు చేస్తున్నారని, మరోవైపు పట్టిసీమను వ్యతిరేకిస్తున్నారని మంత్రి ఉమా విమర్శించారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే జీవో 22 జారీ చేశామని, పనుల చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని దేవినేని ఉమా స్పష్టం చేశారు.




