Wednesday, 4 November 2026

విజయవాడలో ఇంజినీరింగ్‌ కాలేజీకి బాంబు బెదిరింపు

విజయవాడ: ఓ కాలేజీకి వచ్చిన బాంబు బెదిరింపు కాల్‌తో యాజమాన్యం సహా విద్యార్థులు వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఎన్కేపాడులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఈ మధ్యాహ్నం ఓ బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. కాలేజీలో బాంబుపెట్టామని, మరికొద్ది సేపట్లో అది పేలబోతోందని చెప్పారు. విషయాన్ని యాజమాన్యం పోలీసులకు తెలపడంతో బాంబ్‌స్కాడ్‌ వచ్చి తనిఖీలు నిర్వహిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *