Tuesday, 3 November 2026

పవన్ అభిమాని గొంతు కోసిన దుండుగుల ఫొటోల విడుదల

శిల్పకళా వేదిక వద్ద బ్లేడు పట్టుకొని తిరుగుతున్న యువకుడు

గచ్చిబౌలి: ‘గోపాల గోపాల’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ టికెట్ల కోసం గొడవపడి పవన్ కల్యాన్ అభిమాని  కన్నా శ్రీనివాస్‌పై దాడి చేసి గొంతు కోసిన దుండగుల ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదిక ఆవరణలో ఆదివారం కొందరు యువకులు శ్రీనివాస్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడి జరుగుతున్నప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను సేకరించారు.

గొంతుకోసిన నిందితుడితో పాటు దాడికి పాల్పడ్డ వారి ఫొటోలను పోలీసులు మీడియాకు సోమవారం విడుదల చేశారు. వారి వివరాలు తెలిసిన వారు మాదాపూర్ పోలీస్‌స్టేషన్ లేదా ఫోన్ నెంబర్ 9493549415, 9491030063 లకు తెలియజేయాలని ఎస్‌ఐ నరేష్ కోరారు. ఇదిలా ఉండగా…  సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *