Monday, 2 November 2026

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో దిట్ట అనిపించుకున్న సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి):  జలవిధానంపై సీఎం కేసీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో సభ్యులను ఆకట్టుకున్నారు. కంపూటర్‌ ముందు కూర్చుని మౌజ్‌ కదుపుతూ ఆయన నీటి ప్రాజెక్టులపై సమగ్ర విశ్లేషణ చేశారు. ఎక్కడెక్కడ ఏయే ప్రాజెక్ట్‌ ప్రతిపాదించారో, ఎందువల్ల దానిని రీ డిజైన్‌ చేయాలనుకుంటున్నామో అన్న విషయాలను ఓ అధ్యాపకుడిలా వివరించారు. నిష్ణాత సాంకేతిక నిపుణుడిలా ప్రాజెక్టుల వివరాలను అసెంబ్లీలో వివరించారు. నిజమైన హైటెక్‌ సీఎంగా కేసీఆర్‌ వ్యవహరించి సభ్యులను అబ్బురపరిచారు.  అసెంబ్లీలో జల విధానంపై త్రీడీ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ సందర్భంగా ఆయన కంప్యూటర్‌ మౌస్‌ను ఎంతో చాకచక్యంగా ఆపరేట్‌ చేశారు.మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కృష్ణా, గోదావరి నదులపై ఎక్కడెక్కడ, ఏఏ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టారో గూగుల్‌ మ్యాప్‌ ద్వారా పాయింట్‌ టు పాయింట్‌ నిర్దేశిస్తూ అసెంబ్లీలోని భారీ స్కీన్లప్రై ప్రదర్శించారు. ఎక్కడెక్కడ ఎంత ఎత్తున లిఫ్టులు ఏర్పాటు చేసుకున్నారో, అంగుళం అంగుళం నీటిని ఎలా వినియోగించుకుంటున్నారో వివరించారు. ఇలాంటి పరిస్థితులో మన రాష్టాన్న్రి ఎవరూ కాపాడుతారు అధ్యక్షా అంటూ ప్రతిపక్ష సభ్యులనుద్దేశించి ప్రశ్నించారు.  గూగుల్‌ ద్వారా తాను ఎంత కష్టపడి ఈ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల వివరాలను సేకరించారో సీఎం వివరించారు. సీఎం కేసీఆర్‌ ఇరిగేషన్‌పై చేసిన వివరణ జల వనరుల నిపుణులను కూడా ఆకర్షించింది.

ప్రాజెక్టుల రీ డిజైన్‌లు ఎందుకు అవసరమో సీఎం సభ్యులకు సవివరంగా చెప్పారు. ఎలా చేస్తే తెలంగాణకు సాగునీరు, తాగునీరు అందుతుందో ఒక సాంకేతిక నిపుణుడిగా వివరించారు. కర్ణాటక, మహరాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ టన్నెల్స్‌, ఎత్తిపోతల పథకాలు చేపట్టాయో కూలంకశంగా పేర్కొన్నారు. ప్రతి ప్రాజెక్టను ల్యాప్‌ టాప్‌ లో చూపించారు. ఆ లొకేషన్‌ లో తీసుకునే చర్యలను వివరించారు. ప్రాజెక్టుల వల్ల ప్రతి ఆయకట్టుకు నీరు ఎలా అందుతుందో గూగుల్‌ మ్యాప్‌ ద్వారా సీఎం వివరించిన తీరు టీవీ ముందు కూర్చున్న వారికి కూడా మంచి అవగాహన కల్పించేదిగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *