Monday, 2 November 2026

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

హైదరాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి: హైదరాబాద్‌  నగరంలోని రాజేంద్రనగర్‌ పరిధిలోని నార్సింగి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-బోలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్‌ నుంచి పటాన్‌చెర్వుకు వెళ్తోండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కాటేదాన్‌కు చెందిన వారుగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *