Tuesday, 3 November 2026

పసికందును రహదారిపై వదిలేసిన సంఘటన

కరీంనగర్‌ : నెలలు నిండని ఓ పసికందును రహదారిపై వదిలేసిన ఘటన శనివారం ఉదయం కరీంనగర్‌లో చోటుచేసుకుంది. కరీంనగర్‌లోని ఆర్‌టీసీ వర్క్‌షాపు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నెలలు పసికందును వదిలేసి వెళ్లిపోయారు. పసికందు మృతదేహాన్ని గమనించిన పాదచారులు మీడియాకు సమాచారమందించారు. పారిశుధ్య కార్మికులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *