కరాచీ : ప్రపంచంలో ఎత్తెన భవనంగా పేరొందిన దుబాయ్ బుర్జ్ ఖలీఫాను తలదన్నే మరో ఎత్తైన భవనాన్ని పాకిస్థాన్‌లో నిర్మించబోతున్నారు. పాకిస్థాన్‌కి చెందిన నిర్మాణ రంగ వ్యాపారి మాలిక్ రియాజ్ అబూదాబికి చెందిన ఓ సంస్థతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కరాచీ తీరాన అరేబియా సముద్రంలోని ఒక ద్వీపంలో దీన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పాతిక లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, పలు రంగాల్లో పెట్టుబడులు పెరుగు తాయని రియాజ్ అంటున్నారు. 45 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఒప్పందంపై శుక్రవారం సంతకాలు అయినట్లు తెలుస్తోంది.




