Monday, 2 November 2026

పాక్‌లోని క్వెట్టాలో బాంబు పేలుడు.. 63 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతం మరోసారి రక్తమోడింది. షియా వర్గం లక్ష్యంగా ముష్కరులు శక్తివంతమైన బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 63 మంది మృత్యువాతపడ్డారు.200 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. హజరా పట్టణానికి సమీపంలో రద్దీగా ఉండే  కిరాని రహదారిపై ఈ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు దాటికి రెండంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు లష్కర్‌ – ఈ జాంగ్వీ సంస్థ ప్రకటించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *