లహోర్: మూడు రోజుల పాక్ పర్యటనపై భారత విదేశాంగ మంత్రి ఎన్.ఎం.కృష్ణ సంతృప్తి వ్యక్తం చేశారు. పాక్‌తో నమ్మకమైన సంబంధాలను పెంపొందించుకునేందుకు తన పర్యటన దోహదపడిందన్నారు. పాక్ అధ్యక్షుడు జర్దారీ, ప్రధాని అష్రాఫ్, విదేశాంగ మంత్రి రబ్బానీలతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని తెలిపారు. పర్యటనలో చివరిరోజైన ఆదివారం ఆయన లహోర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఇతర నేతలతో చర్చలు జరిపారు.




