పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి
— జిల్లా విద్యాశాఖాధికారి కె. నారాయణ రెడ్డి
మోత్కూరు డిసెంబర్ 22 జనంసాక్షి : మున్సిపల్ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల పూర్వవిద్యార్థి, పాఠశాల దాత వడ్డేపల్లి లక్ష్మీనర్సయ్య రిటైర్డ్ లెక్చరర్ కు జిల్లా విద్యాశాఖాధికారి కె. నారాయణ రెడ్డి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి మాట్లాడుతూ ఇలాంటి దాతలు ముందుకు వచ్చి మన ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. డిఈఒ నారాయణ రెడ్డి, లక్ష్మీనర్సయ్య ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల దాత లక్ష్మీనర్సయ్య పాఠశాల కు సుమారు 2 లక్షల పై చిలుకు విలువ గల స్మార్ట్ టివి, వాటర్ ఫిల్టర్, మైక్ సెట్ లను, విద్యార్థులకు నోట్ బుక్స్, టై బెల్ట్ లు ఇవ్వడం జరిగింది. అనంతరం వచ్చిన వారందరికి లక్షినర్సయ్య భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తీపి రెడ్డి సావిత్రి, వైస్ ఛైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ గుర్రం లక్ష్మీనర్సింహా రెడ్డి,ఎంపిడిఓ జి. చంద్రమౌళి,ఎంఈఒ వి. శ్రీధర్, పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మారపు వెంకటయ్య, పిఆర్టియు మండల అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయినిలు కె. అరుణాదేవి,సౌజన్య, జ్యోతి,లలిత వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినిలు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి — జిల్లా విద్యాశాఖాధికారి కె. నారాయణ రెడ్డి




