పాతబస్తీలో ఓ బాలికతో అరబ్‌షేక్ వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. డబ్బులిచ్చి పేద ముస్లిమ్ బాలికలను వృద్ధ అరబ్‌షేక్‌లు పెళ్లాడి తీసుకువెళుతున్న ఉదంతాల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఓ అరబ్‌షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరబ్‌షేక్‌తో వివాహం విషయంలో బ్రోకర్లు ఎవరనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




