ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ చేతుల మీదుగా శంకుస్థాపన
టేకులపల్లి, ఫిబ్రవరి 24( జనం సాక్షి ): శ్రీ రామాలయ స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కోటి రూపాయలు వ్యయంతో ఆలయ నిర్మాణానికి ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ శుక్రవారం శంకుస్థాపన చేశారు. టేకులపల్లి మండలంలోని రాంపురం గ్రామపంచాయతీ పాత తండా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే హరి ప్రియని వేద పండితులతో వేదమంత్రాల మధ్య సన్నాయి మేళ తాళాల వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.పాత తండా గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ కలిసి పాతతండా గ్రామా పేరును రాంనగర్ గా నామకరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భిన్న సంస్కృతి, సాంప్రదాయాలు గల తెలంగాణలో అన్ని మతాల వారికి సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యతనిస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగిస్తున్నారని అన్నారు.నేడు ఆలయ పునర్నిర్మాణంలో తాను కూడా భాగస్వామిని అయినందుకు ఈ గ్రామ ప్రజలతోపాటు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాంనగర్ గ్రామ ప్రజలు, ఇక్కడి ఉద్యోగస్తులు అందరూ కలిసి దేవాలయ పునర్నిర్మాణానికి తోడ్పడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని వారిని అభినందించారు. ఆధ్యాత్మిక సేవలో ఉన్న ఆనందం చెప్పలేనిది అన్నారు. ఈ సీతారామాంజనేయ ఆలయానికి ఎప్పుడు నా సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులుఆలయ కమిటీ చైర్మన్ నునావత్ బిక్కులాల్, ప్రధాన కార్యదర్శి బర్మావత్ శివకృష్ణ, గౌరవ అధ్యక్షులు బర్మావత్ లాలు, ఉపాధ్యక్షులు భుక్య ఇర్లాల్, మంజులాల్, మండల బిఆర్ఎస్ అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, రాంపురం సర్పంచ్ భుక్య ఇందిరా రమేష్,MPTC బానోత్ సరోజినీ,చీమల సత్యనారాయ�
పాత తండాలో కోటి రూపాయల వ్యయంతో రామాలయం పునర్నిర్మాణంపాత తండాలో కోటి రూపాయల వ్యయంతో రామాలయం పునర్నిర్మాణం




