Tuesday, 3 November 2026

విద్యుత్ శాఖ ఉద్యోగుల నిరసన…

శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 24
విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్దేశం ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు శుక్రవారం నుండి నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తాడికల్ సబ్ స్టేషన్ ఏఈ సంపత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏఈ సంపత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో వద్యుత్ శాఖ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతన సవరణ పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు ఈనెల 24 నుండి 27 వరకు నాలుగు రోజులపాటు విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపడుతూ విధులు నిర్వహించనున్నట్లు సంపత్ రెడ్డి వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమం తాటికల్స్ సబ్ స్టేషన్ ఉద్యోగులు ,తదితరులు పాల్గొన్నారు.