Thursday, 5 November 2026

పాన్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం  

పాన్‌షాప్‌ యజమానిపై సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని ఫిర్యాదు
కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలింపు
హైదరాబాద్‌, జూన్‌8(జ‌నం సాక్షి) : ఓ కామాంధుడి ఉచ్చులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని చిక్కుకుంది. సామాజిక మాధ్యమాల ద్వారా యువతికి వల వేసి ఆమె అభ్యంతరకర ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న కామాంధుడిపై బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో  కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఉపేందర్‌ వర్మను అదుపులోకి తీసుకొని రిమాండ్‌ తరలించారు. కాగా వర్మకు సహకరించిన మరో స్నేహితుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే..  హైదరాబాద్‌ సిక్‌ విలేజ్‌లో ఉండే ఉపేందర్‌ వర్మ పాన్‌ షాప్‌ బిజినెస్‌ నిర్వహిస్తుంటాడు. మయూర్‌ ఫాన్‌ షాప్‌ పేరిట హిమాయత్‌నగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో పాన్‌ షాపులు నిర్వహిస్తున్నాడు. ఓ మిత్రమండలి పేరిట సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్టు పెట్టాడు. మిత్రమండలి అని ఉందని.. సేవాభావంతో ఉన్నవాడేమో అనుకుని ఫ్రెండ్‌ రిక్వెస్టును ఆహ్వానించింది. నెమ్మదిగా అమ్మాయికి దగ్గరయ్యాడు. తన వ్యాపార సామ్రాజ్యం గురించి చెప్పి యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె ఉపేంద్ర వర్మ చెప్పిందంతా చేసింది. పార్కులు, ¬టళ్ల చుట్టూ తిరగారు. స్వీట్‌ పాన్‌లు తినిపించాడు. పాన్‌లో మత్తు పదార్థాలు కలిపి యువతి స్పృహ కోల్పోగానే అత్యాచారం చేశాడు. అలా అనేకసార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి కూడా మౌనంగా ఉండిపోయింది. పెళ్లి గురించి ఉపేంద్రపై ఒత్తిడి తీసుకువచ్చింది. తనకు అప్పటికే రాజస్థాన్‌ యువతితో పెళ్లి అయిందని, పాప కూడా ఉందని చెప్పడంతో ఆ యువతికి గుండె బద్దలైనంత పనైంది. విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది. ఆమె తల్లిదండ్రులు ఉపేంద్రను నిలదీయడంతో అతను మాట మార్చాడు. కొద్దిరోజులు ఆగితే తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చివరికి గత ఏడాది పెళ్లి చేసుకున్న ఆయన ఆమెను గోవా తీసుకువెళ్లాడు. అక్కడ స్నేహితుల సమక్షంలో అసభ్యకర రీతిలో ప్రవర్తించాడు. అయినా మౌనంగా భరించింది. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో, అతని స్నేహితులు కూడా అమ్మాయిని వేధిస్తుండడంతో చివరికి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు సెక్షన్లకింద ఉపేంద్రవర్మపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఆయనకు సహకరించిన మరో స్నేహితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మా బిడ్డకు న్యాయం చేయండంటూ బాధితురాలి కుటుంబీకులు పోలీసులను వేడుకుంటున్నారు.