Wednesday, 4 November 2026

పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడు

 

 

 

 

 

 

 

బిచ్కుంద జులై 07 (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల బీఆర్ఎస్ నాయకుడు తన రాజకీయ బలంతో ప్రజల సమస్యల పంచాయతీల్లో వెళ్లి తన స్వలాభ నిర్ణయాలు ప్రకటిస్తున్నట్లు ప్రజలు ఆగ్రహము వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తికి తమ పార్టీ కార్యచరణలు తెలియజేస్తునట్లు మండలంలో గుసగుసలు వినబడుతున్నాయి. ఇప్పుడైతే ఏకంగా ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓ కేసులో ఇరుక్కోగా తానే స్వయంగా పోలీసు ఠాణాకు వెళ్లి తాను సెటిల్మెంట్ చేస్తానని ఎస్సైకు చెప్పడం గమనార్హం. స్వయంగా ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారో లేదా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సదరు ఆ వ్యక్తిపై వేటు వేస్తుందో జనం వేచి చూస్తున్నారు.