వీర్నపల్లి, జులై 04 (జనంసాక్షి): మండలంలోని అన్ని గ్రామాలలో టిడిపి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని నూతనంగ ఎన్నికైన టిడిపి పార్టీ మండల అధ్యక్షడు పెడ్తనపెల్లి రాములు అన్నాడు. తనపై నమ్మకం ఉంచుకొని అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, నియోజక వర్గ ఇంచార్జి దయాకర్ రావులకు ధన్యవాదాలు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా టిడిపి పార్టీ మండల అధ్యక్షడు రాములు




