గద్వాల నడిగడ్డ, జులై 4 (జనం సాక్షి);జాతీయ ఆహార భద్రత పథకం కింద వడ్డేపల్లి మండల పరిధిలోని రామాపురం గ్రామ రైతులకు ప్రతి రైతుకు 4 కేజీల కందులను మంగళవారం వడ్డేపల్లి వ్యవసాయ అధికారిని రాధ ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు.
2023 -24 వ సంవత్సరం వానాకాలం సీజన్ కి సంబంధించి ఎన్ ఎఫ్ ఎస్ ఎం చిరు సంచల ప్రయోగం పథకం కింద కందులు డబ్ల్యు ఆర్ జి ఇ 93, ఎల్ ఆర్ జి 52, పి ఆర్ జి 176, రకాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని మండల మొత్తానికి 250 ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని, ఒక రైతుకు 4 కేజీల ఒక బ్యాగ్ మాత్రమే ఇవ్వబడునని ఆసక్తిగల రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి సంప్రదించాలని, కందులు కావలసిన రైతులు రైతు పాస్ బుక్ ఆధార్ కార్డు జిరాక్స్ తప్పకుండా ఇవ్వాలని ఆమె తెలిపారు.
జాతీయ ఆహార భద్రత పథకం కింద కందుల పంపిణీ -వ్యవసాయ మండల అధికారి రాధ.




