Saturday, 7 November 2026

పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి.

పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి.
-ఎంఎస్ పి జిల్లా కన్వీనర్ గూట విజయ్ మాదిగ.
-జిల్లా కేంద్రంలో ఎంఎస్ పి దీక్ష.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్20(జనంసాక్షి):

పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని మంగళవారం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో ఎంఎస్ పి జిల్లా కన్వీనర్ గూట విజయ్ మాదిగ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించడం జరిగింది.ఈ దీక్ష లో గూట విజయ్ మాదిగ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని లేనిపక్షంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంటును ముట్టడి చేస్తామని హెచ్చరించారు. బిజెపి పార్టీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ ల వర్గీకరణ బిల్లు పార్లమెంటు లో ప్రవేశపెడతామని వారి మేనిఫెస్టో లో పొందుపరిచి మందకృష్ణ మాదిగ చేపట్టిన అనేక సభలు,సమావేశాల లో కేంద్ర మంత్రులు పార్టీ నాయకులు హాజరై మాదిగలకు వర్గీకరణ పై పలుమార్లు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టకపోవడం బిజెపి పార్టీ మాదిగలను మోసం చేస్తుందని మేం భావిస్తున్నామని అన్నారు.ఇకనైనా ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేలా బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడి ఎస్సీల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టే విధంగా ముందుండి నడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామని లేని పక్షంలో ఇరు పార్టీల నాయకులను మాదిగ వాడలలో తిరగనీయమని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నా మని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ పి నాయకులు నాల్లగంటి నాగయ్య, యాకోబు,ఎం. వెంకటయ్య, శంకర్, శివ, బొలమశయ్య తదితరులు పాల్గొన్నారు.