Saturday, 7 November 2026

ఆరోపణలపై చర్చకు సిద్ధమా.

ఆరోపణలపై చర్చకు సిద్ధమా…… ?

…. అసంబద్ధ ప్రేలాపనలు మానుకోవాలి

….. స్థాయిని మరిచి విమర్శలా …..

బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు శాతరాజు యాదగిరి

మానకొండూరు, ఆర్ సి, డిసెంబరు 20( జనం సాక్షి)

ఎస్సీ, ఎస్టీ మైనారిటీల పై ఎన్ని దాడులు జరిగాయి ఏ వర్గాలకు రక్షణ కరువైందో, జక్కని నిరూపించాలని భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు శాతరాజు యాదగిరి డిమాండ్ చేశారు. కర్ణపు దొర తొత్తుగా ఎవరు వ్యవహరిస్తున్నారొ తక్షణం బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు. బహుజన సమాజ్ పార్టీ బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మానకొండూరులో జరిగిన ముగింపు యాత్రలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జక్కని సంజయ్ కుమార్ చేసిన ఆరోపణలు,విమర్శలు,వివాదాస్పద వ్యాఖ్యల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ఈ ఉదంతంపై పార్టీ వర్గాల్లో సైతం జోరుగా చర్చ కొనసాగుతోంది. ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శాతరాజు యాదగిరి స్పందించారు. తక్షణం మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు జక్కని సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో సీట్లు ఇప్పిస్తానని, కళాశాలలో స్కాలర్షీప్ మంజూరు చేస్తానని వసూళ్ల పర్వం కొనసాగించిన ఘనుడు ఎవరో చిట్టా మండలంలో అందరికి సుపరిచితమే అన్నారు. ఎంతమంది బీఆర్ఎస్ నాయకుల వద్ద ఎన్ని రూపాయలు ఖర్చులకు వసూలు చేశావొ మరిచావా జక్కని అని ఆయన ప్రశ్నించారు. పరాయి సొమ్ములకు ఆశపడిన నీచ చరిత్ర ఎవరిదో ప్రజలందరికీ తెలుసన్నారు. మిడి మిడి జ్ఞానంతో అజ్ఞాన వ్యాఖ్యలు చేయవద్దని హితువు పలికారు. పార్టీలో పదవులు రిజర్వేషన్లు తదితర అంశాలు క్రోడీకరించి సమిష్టి నిర్ణయం మేరకు పదవులు కట్టబెడతారని ఐదు మండలాలలో ఎంపీపీలు రెడ్డివర్గానికిచెందినవారు ఉన్నారని వాఖ్యనించటం ఆయన అవగాహనలేమికి నిదర్శనమన్నారు. అసమర్థుడు, స్థానికేతరుడు, లఫూట్ అని మాట్లాడిన తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ఆక్షేపణ తెలిపారు ఈ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా సంస్కృతి ప్రజాస్వామ్య భాష ఇదేనా అని సూటిగా ప్రశ్నించారు.” గాడిద కొడుకు ”ఎవరో ఎక్కడివారో మాట్లాడే వారికే బాగా తెలుసునని చురకలంటించారు.
అసత్య, ప్రేలాపనలు మానకుంటే జక్కని తిక్క కుదర్చడం ఖాయమని తేల్చి చెప్పారు. పదవుల్లో ఉన్నవారు ఎన్నికల్లో గెలిచినవారా లేక ఓడినవారా, ఓడిన వారికి పదవులు కట్టబెట్టారా రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్ల పాలనలో ఎన్ని ఎత్తు పల్లాలు ,నిద్రలేని రాత్రులు, నిర్బంధాలు ,నిరసనలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలలో మొక్కవోని ధైర్యంతో అలుపెరగని పోరాటం చేసిన ఘనత రసమైదేనన్నారు. పై స్థాయి వారిని దూషిస్తే వచ్చేది పదవులు కాదు .. వాతలని ఈ విషయం తెలుసుకోవాలని సూచించారు .ఇకనైనా వ్యక్తిగత ఆరోపణలుమానకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.