ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కొండమల్లేపల్లి జనవరి 23 (జనంసాక్షి) న్యూస్ : పాలకవీడు మండల ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో అమరవాది లక్ష్మీనారాయణ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మరియు తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వూరే లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు. ఈ సందర్భంగా పాలకవీడు మండల ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభను ఉద్దేశించి వూరే లక్ష్మణ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సామాజిక సేవలు ముందుండాలని రాజకీయరంగంలో రాణించాలని ఆర్యవైశ్యులు అంటేనే సేవా గుణానికి నిదర్శనమని అయితే ఆర్యవైశ్యులు మరింత సేవాభావాన్ని పెంపొందించుకోవాలని సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తెలిపారు ఆర్యవైశ్యులు అంటే ఆర్థికంగా స్థిరపడ్డవారన్న పేరుందని అయితే ఆర్యవైశ్యులలో కూడా పేదరికంలో బాధపడుతున్న వారున్నారని ఆర్థికంగా వెనుకబడ్డ ఆర్యవైశ్యులకు ఆదుకునేందుకు ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు ముందుకు రావాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ మాదిరిగా ఆర్యవైశ్యులకు కూడా ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్యులకు ఆర్థికపరంగా సహాయం అందించాలని సూచించారు ఆర్యవైశ్యులు అంటే నీతికి నిజాయితీకి మారుపేరు ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా కావాల్సిన సమయం ఆసన్నమైందని వారు తెలిపారు సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు నూతన కమిటీగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు కార్యవర్గ సభ్యులు నూతన కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రేణిగుంట్ల గణేష్ గుప్తా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఇరుకుళ్ళ రామకృష్ణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు, కాసం సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి, అగిరి వెంకటేష్ గుప్తా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మీడియా చైర్మన్, మాశెట్టి అనంత రాములు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, బండారు రాజా, గుండా బిక్షపతి, తెల్లాకుల వెంకటేశ్వర్లు, తాటికొండ సీతయ్య, మీలా వంశీ, గుండా శ్రీదేవి, తాళ్లూరి లక్ష్మీనారాయణ రాచకొండ శ్రీనివాస్ రావు, కొత్త లక్ష్మణ్ వీరవెల్లి శ్రీలత మరియు ఆర్యవైశ్య సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు
పాలకవీడు మండల ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వూరే లక్ష్మణ్




