Thursday, 5 November 2026

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

..

ఖమ్మం తిరుమలాయపాలెం(జనవరి 23) జనం సాక్షి.. తిరుమలాయపాలెం జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 1992 _ 1993 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వపాఠశాలప్రధానోపాధ్యాయురాలు సమక్షంలో జరిగిన ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ కార్యక్రమానికి నాటి విద్యార్థులు గురువులు ముఖ్య అతిథులుగా వచ్చిన వారు విద్యార్థుల గురించి. వారి ఎదుగుదల గురించి. తెలుసుకొని గర్వించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థిని విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఉపాధ్యాయులు శ్రీరాధాకృష్ణమూర్తి, శ్రీమతి బేబీ, శ్రీ రామారావు, ఆళ్ల రామారావు, నాగేశ్వరరావు, పాల్గొని విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు. స్థానికంగా ఉన్ననాటి విద్యార్థులలో కొమ్ము శ్రీను, కొప్పుల రమేష్, ఉండేటి రాము, బాబు, సామినేని ఉపేందర్, ఉప్పమ్మ, మహబూబ్, పారిజాతం, కౌసల్య, ప్రగతి ,అనిత, వీరమ్మ, వనజ మంగయ్య దుర్గయ్య, చంద్రశేఖర్ , మొత్తం 40 మంది మిత్రులు పాల్గొన్నారు.