కొండమల్లేపల్లి జనవరి 23 (జనంసాక్షి) న్యూస్ :
దేవరకొండ నియోజకవర్గం పరిధిలో గల చింతపల్లి మండలం గోడకొండ్ల గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికులు పాలకుర్ల రామచంద్రయ్య చనిపోయిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్నా టీపీసీసీ నాయకులు కేతావత్ భీల్యా నాయక్ వారి నివాసానికి చేరుకొని వారి పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి మనొధైర్యని నింపారు.మరియు రామచంద్రయ్య మనస్థత్వని ,మంచితనాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో సురిగి జంగయ్య గౌడ్,రామిని నాగేష్, రావి, శ్రీను,మొగుతాల మహేష్, జైపాల్ నాయక్,బీల్యా నాయక్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు
పాలకూర్ల రామ చంద్రయ్య మృతి చాలా బాధాకరం టిపిసిసి నాయకులు కేతావత్ భీల్యా నాయక్




