పాలడుగు లో పిర్జాధిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
మోత్కూరు డిసెంబర్ 5 జనంసాక్షి : పిర్జాధిగుడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్వగ్రామం పాలడుగు గ్రామ ప్రాథమిక పాఠశాలలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి పూర్వ స్నేహితులు కొంపెల్లి భాస్కర్, అంతటి భగంవత్ సమక్షంలో పాటశాల విద్యార్థిని, విద్యార్థులకు పెన్నులు, పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రిపల్లి యాదయ్య, గుంటొజు భాస్కర్, కొంపెల్లి సోమయ్య, పంచాయతీ కార్యదర్శి శంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మర్రిపల్లి చంద్రయ్య,పబ్బు బుచ్చిరాములు, రమేష్,యాదగిరి,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.




