-ప్రజల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్.
-టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లురవి.
-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కు రాజకీయాలు.
-కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ.
-సంక్షేమం ముసుగులో పేదల భూములు స్వాధీనం చేసుకుంటున్న టీఆర్ఎస్.
-నాగం శశిధర్ రెడ్డి.
ప్రకటనలకే పరిమితం అయిన కేసీఆర్.
అభిలాషరావు.
-కలెక్టరేట్ ముట్టడిలో కాంగ్రెస్ నేతలు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 7 (జనంసాక్షి):
రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయడంతో పాటు రైతుల సంక్షేమానికి వరంగల్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందని వాటిని తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామని టిపిసిసి ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ డాక్టర్ మల్లురవి,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా ఇన్చార్జి జంగారెడ్డి, కాంగ్రెస్ నేతలు అభిలాషరావు,నాగం శశిధర్ రెడ్డి,అర్థంరవిలు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ నుండి కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ధర్నాలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల ముసుగులో స్వాధీనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ధరణి పోర్టల్ అధికార పార్టీ బడా పారిశ్రామిక వ్యక్తులకు వరంగా మారిందని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న స్థలానికి రహదారులకు కూడా రైతు బంధు అందుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో 4500 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. జిల్లాలోని అచ్చంపేట కొల్లాపూర్ నియోజక వర్గాలలో కూడా పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. చిన్న చిన్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని భూమి మొత్తం నిషేధిత జాబితాలో ఉంచడం దారుణమని మండిపడ్డారు.50 సంవత్సరాల క్రితం విక్రయించిన భూములను కూడా ధరణి పోర్టల్ లో వారి పేరే ఉండడం దగా చేయడమేనన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం వెనకంజలో ఉందని మద్యం విక్రయాలలో మాత్రం ముందు వరుసలో ఉందన్నారు.బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని మద్యం తెలంగాణగా మార్చారని విమర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో జిల్లా మొత్తం సస్యశ్యామలం అయ్యిందని ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగిందని పేర్కొనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.టిఆర్ఎస్ బిజెపి పార్టీ లు కుమ్మకు రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు చేస్తున్న కుట్రలను క్షేత్రస్థాయిలో శ్రేణులంతా ఏకమై తిప్పికొట్టాలని రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ప్రభుత్వాలలో తరిమి కొడితేనే హామీలు అమనవుతాయని అన్నారు. వ్యవసాయంపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని ఎంపికకు ఎమ్మెల్యేలను కాకుండా కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.ధరణి పథకాన్ని రద్దు చేయకపోతే కేసీఆర్ ను ప్రగతి భవన్ లో నిర్బంధిస్తామని హెచ్చరించారు. ఓటు హక్కుతో ప్రభుత్వాలను గుణపాఠం చెప్పాలని కోరారు బడ్జెట్లో రైతు రుణమాఫీ కి నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు అక్రమంగా నిర్బంధిస్తున్నారని ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మారుమూల ప్రాంతంలో ఉన్న కార్యకర్తలను కూడా అరెస్టు చేయడం దారుణమని ఇలాంటి వైఖరులను విడనాడకపోతే పోలీస్ స్టేషన్లలోనే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. హామీలను అమలు చేసే వరకు పోరాటాలను ఉదృతం చేస్తామని మండిపడ్డారు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలను ప్రకటనకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు ఈ ధర్నాలో
జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొడిదల రాము,ఐఎన్ టి యూసీ జిల్లా అధ్యక్షుడు తయిలి శ్రీనివాసులు,జిల్లా మహిళా అధ్యక్షురాలు జడ్పీటీసీ రోహిణి రెడ్డి, సుమిత్ర దేవి, నాగర్ కర్నూల్ మున్సిపల్ అధ్యక్షుడు తిమ్మాజీపేట పాండు, నాగర్ కర్నూల్ మండల అధ్యక్షుడు కోటయ్య, తాడూరు మండల అధ్యక్షుడు ఐతోల్ లక్ష్మయ్య, బిజినపల్లి మండలం అధ్యక్షుడు సుహాసన్ రెడ్డి, మున్సిపాలిటీ కౌన్సిలర్-ఎండి నిజాముద్దీన్, తీగల సుణేంద్ర, సుల్తాన్, నాగర్ కర్నూల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబీబ్,ఐఎన్ టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు పర్వతాలు, నాగర్ కర్నూల్ జిల్లా ఎన్ ఎస్ యూఐ అధ్యక్షుడు అన్వేష్ గౌడ్, నాయకులు సలీం, సత్యం,అహ్మద్ పాషా మరియు అన్ని నియోజకవర్గా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




